Mahesh Son - స్విమ్మింగ్ లో గౌతమ్ టాలెంట్

Thursday,June 17,2021 - 02:03 by Z_CLU

గౌతమ్ ఘట్టమనేని.. మహేష్ బాబు కొడుకు. ఈ కుర్రాడు ఇండస్ట్రీకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ అంతలోనే అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు గౌతమ్. అయితే అది సినిమాలతో మాత్రం కాదు. గౌతమ్ తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టాడు.

Mahesh son Gautam

గౌతమ్ మంచి స్విమ్మర్. ఈ విషయాన్ని ఆమె తల్లి నమ్రత శిరోద్కర్ బయటపెట్టింది. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ కాంపిటిషన్ లో టాప్-8లో గౌతమ్ నిలిచాడు. గౌతమ్ లో ఈ టాలెంట్ కూడా ఉందనే విషయం నమ్రత చెప్పేవరకు ఎవ్వరికీ తెలియదు.

“చాలా గర్వంగా ఉంది. 2018 నుంచి గౌతమ్ స్విమ్మింగ్ ను ప్రొఫెషన్ గా తీసుకున్నాడు. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ కాంపిటిషన్ లో గౌతమ్ అలవోకగా టాప్-8లో నిలిచాడు. గౌతమ్ కు మేం ఎవ్వరం చెప్పలేదు. అతడే సహజంగా ఈ స్పోర్ట్ ను ఎంపిక చేసుకున్నాడు. స్విమ్మింగ్ లో హార్డ్ వర్క్ ను వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు. స్విమ్మింగ్ లో మంచి టెక్నిక్, వేగం సంపాదించాడు.”

బట్టర్ ఫ్లై బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టయిల్.. ఇలా ప్రతి విభాగంలో గౌతమ్ మెరుగ్గా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చింది నమ్రత. వీటిలో ఫ్రీ స్టయిల్ స్విమ్మింగ్ అంటే గౌతమ్ కు బాగా ఇష్టమని, ఈ విభాగంలో నాన్ స్టాప్ గా 5 కిలోమీటర్లు ఈదగలడని అంటోంది. ఈ సందర్భంగా గౌతమ్ ఫాస్ట్ గా స్విమ్ చేసిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది నమ్రత.

గౌతమ్ లో దాగున్న ఈ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇన్నాళ్లూ గౌతమ్ ను ఓ చిన్న పిల్లాడిగా, బాలనటుడిగా మాత్రమే చూసిన జనాలు.. అతడిలోని స్విమ్మింగ్ టాలెంట్ కు ఆశ్చర్యపోతున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics