మహేష్.... అంటున్న ఎన్టీఆర్

Thursday,August 04,2016 - 04:59 by Z_CLU

ఈమధ్య కాలంలో ఫ్యాన్స్ కు బాగా దగ్గరవుతున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ షూటింగ్ టైమ్ లో వేల సంఖ్యలో అభిమానులను కలిశాడు. షూటింగ్ అయిపోవడమే ఆలస్యం…ఫ్యాన్స్ తో ఓ మీటింగ్ ఏర్పాటుచేసేవాడు. అలా అభిమానవర్గాన్ని పెంచుకున్న ఎన్టీఆర్… ఎట్ ది సేమ్ టైం… హీరోలతో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పటికే చెర్రీని బాద్ షా ఓపెనింగ్ కు పిలిచాడు. ఓ అవార్డు ఫంక్షన్ లో బన్నీతో కలిసి ఫొటోలకు పోజలిచ్చాడు. ఇప్పుడు మహేష్ బాబుకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం… ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ఆడియో ఫంక్షన్ కు మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి.  దర్శకుడు కొరటాల శివ-మహేష్ చాలా క్లోజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేయడంతో పాటు.. కొరటాల కూడా కోరడంతో… జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ కు వచ్చేందుకు మహేష్ అంగీకరించాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. ఈనెల 12న జనతా గ్యారేజ్ ఆడియోను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు నిర్ణయించారు.