Sarkaru Vaari Paata: మహేష్ బర్త్ డే గిఫ్ట్

Sunday,August 09,2020 - 10:14 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. సర్కారు వారి పాట సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

మహేష్ బాబు రూపాయి కాయిన్ ఎగరేస్తున్న చిన్న వీడియోను మోషన్ పోస్టర్ గా రిలీజ్ చేశారు. మహేష్ చేతికి ఓం సింబల్ తో ఉన్న తాడు ఉంది. ఈ వీడియోకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ లోని చిన్న బిట్ ను ఈ మోషన్ పోస్టర్ కు యాడ్ చేశారు. ఈ టైటిల్ సాంగ్ ను శృతిహాసన్ పాడిందని చిన్న టాక్.

మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కొవిడ్ పరిస్థితులు తగ్గిన తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తారు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై జాయింట్ గా నిర్మిస్తారు.