ఎక్స్ క్లూజివ్: SarkaruVaariPaata ఈరోజే 

Saturday,November 21,2020 - 10:05 by Z_CLU

సూపర్ స్టార్ Mahesh Babu, Parasuram కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న SarkaruVaariPaata నేడు పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. మరికాసేపట్లో కూకట్ పల్లిలోని టెంపుల్లో సినిమాను ప్రారంభించబోతున్నారు. అయితే ఎప్పటిలాగే ఓపెనింగ్ కి మహేష్ హాజరుకావడం లేదు.

ఈ కార్యక్రమానికి కొందరు దర్శకులు హాజరు కానున్నారు. Mythri Movie Makers సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

మహేష్ సరసన Keerthy Suresh హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు Thaman మ్యూజిక్ అందిస్తున్నాడు. #Mahesh27 గా రాబోతున్న ఈ కాంబినేషన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి