మరో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న మహేష్....

Thursday,February 16,2017 - 09:08 by Z_CLU

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు కొత్త  ఉత్సాహాన్నిచ్చిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ ఈ సినిమా తరువాత మరికొన్ని మల్టీ స్టారర్ సినిమాలు తెలుగులో సందడి చేశాయి. అయితే ఈ సినిమాతో కెరీర్ లో మొదటి సారిగా మల్టీ స్టారర్ సినిమా చేసిన సూపర్ స్టార్ మహేష్ ప్రెజెంట్ తెలుగులో మరో మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తుంది..

అయితే ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న మహేష్ ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే కొరటాల శివ తో మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఇమ్మీడియట్ గా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సెట్స్ పైకి రావాలని  ప్లాన్ చేసుకున్న మహేష్ ఈ సినిమాల తర్వాత మల్టీ స్టారర్ సినిమా చేసే  ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా మహేష్ భార్య నమ్రత కూడా ఓ మల్టీ స్టారర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పడంతో ఆ సినిమా మహేష్ దేనా.. అనే డౌట్ అందరిలో మొదలైంది. మరి ప్రెజెంట్ రెండు సినిమాలను లైన్లో పెట్టిన మహేష్ ఈ సినిమాల తరువాత ఈ రేంజ్ లో హీట్ ని జెనెరేట్  చేస్తున్న టాక్ ను నిజం చేస్తాడా.. లేదా.. చూడాలి…..