ఒకే రోజు మహేష్, పవన్ సినిమాలు

Sunday,January 15,2017 - 09:45 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే రోజు సందడి చేస్తే ఎలా ఉంటుంది. కచ్చితంగా అది టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతుంది. అలాంటి రోజు ఒకటి అతి దగ్గర్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటా ఆ స్పెషల్ డేకు కౌంట్ డౌన్ కూడాా స్టార్ట్ అయింది. అవును.. మహేష్ చేస్తున్న కొత్త సినిమా, పవన్ కాటమరాయుడు సినిమాలు రెండూ ఒకే రోజు హంగామా చేసే రోజు దూసుకొస్తోంది.

కాటమరాయుడు టీజర్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయబోతున్నట్టు పవన్ అధికాారికంగా ప్రకటించాడు. సంక్రాంతి సందర్భంగా మరో స్టిల్ రిలీజ్ చేసిన పవర్ స్టార్… రిపబ్లిక్ డే రోజున కాటమరాయుడు టీజర్ వస్తుందని ఎనౌన్స్ చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ కూడా అదే రోజు వచ్చే ఛాన్స్ ఉంది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమాకు సంభవామి అనే టైటిల్ అనుకుంటున్నారు. ఆ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిపబ్లిక్ డే రోజున విడుదల చేసే ఛాన్స్ ఉంది.