#Mahesh27 ముహూర్తం ఫిక్స్

Thursday,May 21,2020 - 03:52 by Z_CLU

పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కనున్న మహేష్ 27వ సినిమాకి ముహూర్తం ఖరారైంది. అవును ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను లాంచ్ చేయనున్నారట మేకర్స్. కృష్ణ బర్త్ డే రోజున ఈ సినిమాను ఎనౌన్స్ చేస్తారని మాత్రమే అనుకున్నారంతా. కానీ ఆరోజున ఏకంగా సినిమా లాంఛింగ్ ఉంటుందట.

మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో అతికొద్ది మందితో పూజా కార్యక్రమాలు నిర్వహించి మూవీని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. తన సెంటిమెంట్ ప్రకారం ఎప్పట్లానే మహేష్ ఈ ఓపెనింగ్ కు హాజరుకాకపోవచ్చు.

ఈ ప్రారంభ వేడుకకు మహేష్ భార్య నమ్రత, సుకుమార్, కొరటాల శివ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక అదే రోజు టైటిల్ కూడా అనౌన్స్ చేసే ప్లానింగ్ జరుగుతుందని టాక్.

ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించనున్నాడు. మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు ఓపెనింగ్ రోజు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.