హాట్ టాపిక్: మహేష్ పాన్-ఇండియన్ మూవీ

Tuesday,April 21,2020 - 02:14 by Z_CLU

మహేష్ నెక్ట్స్ మూవీ కన్ ఫర్మ్ అయింది. కృష్ణ బర్త్ డే సందర్భంగా సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారనే విషయాన్ని కూడా జీ సినిమాలు వెల్లడించింది. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమా పాన్-ఇండియన్ మూవీగా రాబోతోంది.

అవును.. మహేష్ నెక్ట్స్ మూవీని తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ప్లాన్ చేస్తున్నారట. కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేస్తారట. ఈ మేరకు డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. మహేష్ ఓకే చెబితే.. అతడి కెరీర్ లో ఇదే ఫుల్ లెంగ్త్ పాన్-ఇండియా మూవీ కాబోతోంది.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక పెద్ద కష్టమేం కాదు. కానీ శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, కియరా అద్వానీ లాంటి పేర్లు తెరపైకి రావడానికి మెయిన్ రీజన్ ఇదే. హిందీ హీరోయిన్ ఉంటే సినిమాకు మరింత పాన్-ఇండియన్ అప్పీల్ వస్తుంది కదా.

నిజానికి మహేష్ ఎప్పుడూ ఈ యాంగిల్ లో ఆలోచించలేదు. తన ప్రయారిటీ ఎప్పుడూ తెలుగు సినిమానే. మధ్యలో స్పైడర్ లాంటి బై-లింగ్విల్ సినిమా చేసినప్పటికీ బాలీవుడ్ మూవీ చేయాలనే ఆలోచన లేదు.

స్పైడర్ ఫుల్ మూవీ కోసం క్లిక్ చేయండి

మరి దర్శకుడు పరశురామ్, మైత్రీ నిర్మాతల ప్రపోజల్ కు మహేష్ ఓకే చెబుతాడా.. లేక చెక్ పెడతాడా.. లెట్స్ వెయిట్ అండ్ సీ