మహేష్-కొరటాల కాంబోలో మరో మూవీ...?

Wednesday,July 20,2016 - 10:17 by Z_CLU

 

సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ బాహుబలికి దగ్గరగా వెళ్లిందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టయిందో అర్థంచేసుకోవచ్చు. ఈ సినిమా విజయంతో మహేష్ బాబుకు, కొరటాల శివపై మరింత నమ్మకం కుదిరింది. అందుకే కొరటాలతో మరో సినిమా చేసేందుకు మహేష్ ప్లాం ఉన్నదని టాక్ వినిపిస్తుంది.
కొరటాలకు మరోసారి మహేష్ ఛాన్స్ ఇవ్వడానికి బలమైన కారణమే ఉంది. శ్రీమంతుడు సక్సెస్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా మహేష్ కెరీర్ ను సైడ్ ట్రాక్ లోకి నెట్టింది. అందుకే తన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ బాగా తెలిసిన కొరటాలకు మరోసారి అవకాశం ఇవ్వాలని మహేష్ నిర్ణయించుకున్నాడట.
ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఈనెలాఖరుకు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని వినికిడి.. శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రీమూవీస్ సంస్థే… కొరటాల-మహేష్ కాంబినేషన్ ను మరోసారి పట్టాలపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఫిలింనగర్ టాక్.