మహేష్ తదుపరి సినిమా అదేనట

Tuesday,August 09,2016 - 04:30 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ ఆచితూచి అడుగులేస్తున్నాడు. ‘శ్రీమంతుడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్… తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేశాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రిన్స్… త్వరలో కొరటాల శివ తో మరో సినిమా చెయ్యనున్నాడనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొట్టగా… తాజాగా ఆ సినిమాకు బదులు మరో సినిమా తెరపైకి వచ్చింది. మహేష్ జన్మదినం సందర్భంగా పి.వి.పి సినిమా సంస్థ మహేష్ తో తదుపరి సినిమా నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. సినిమా చాలా భాగం షూటింగ్ అమెరికాలో ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమా తరువాతే మహేష్-కొరటాల కాంబినేషన్ తెరపైకి వస్తుందేమో చూడాలి.