మహేష్ కొత్త సినిమా టైటిల్...

Friday,September 30,2016 - 04:32 by Z_CLU

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా బాలచంద్రుడు అనే సినిమా చేశాడు మహేష్. ఇప్పుడు అభిమన్యుడిగా మారాడంటున్నారు సినీజనాలు. ప్రస్తుతం నడుస్తున్న గాసిప్ ప్రకారం… మహేష్ కొత్త సినిమాకు అభిమన్యుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. నిజానికి టైటిల్ రేసులో అభిమన్యుడితో పాటు శివ అనే పేరు కూడా పరిశీలించారు. కానీ ఎక్కువమంది అభిమన్యుడు అనే పేరుకే ఫిక్స్ అయ్యారట. యూనిట్ తో కూడా ఎక్కువమంది ఓటు ఈ టైటిల్ కేనట. అందుకే ఇదే పేరు ఫిక్స్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్.

     mahesh-babu-still

     ఈ విషయంలో ఇప్పటి వరకయితే మహేష్ బాబు కానీ, ఇతరత్రా యూనిట్ సభ్యులు కానీ ఈ విషయం పై ఇంకా స్పందించలేదు.  అందుకే ఈ గాసిప్ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా ‘అభిమన్యు’ అనేది ప్రస్తుతానికి జస్ట్ గాసిపే అయినా మహేష్ బాబు సినిమాకి అదే ఆప్ట్ అనిపిస్తుంది కదూ… సో… అన్నీ అనుకున్నట్టు జరిగితే మన శ్రీమంతుడు కాస్తా అభిమాన్యుడిగా మారిపోతాడమన్నమాట.