మహేష్ మూవీకి టైటిల్ ఫిక్స్

Monday,May 27,2019 - 02:41 by Z_CLU

త్వరలోనే అనీల్ రావిపూడి డైరక్షన్ లో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు మహేష్. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. సరిలేరు నీకెవ్వరు అనేది ఈ సినిమా టైటిల్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇదే పేరును లాంఛింగ్ రోజున ఎనౌన్స్ చేయబోతున్నారు.

ఈనెల 31న మహేష్-అనీల్ రావిపూడి సినిమా లాంఛ్ కానుంది. ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కాబట్టి, ఆ సందర్భంగా మూవీని లాంఛ్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు. లాంఛింగ్ కు ఆయన వచ్చే ఛాన్స్ లేదు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడు డైరక్టర్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేశాడు. అనీల్ సుంకర నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాలో బండ్ల గణేశ్, విజయశాంతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.