వైరల్ పిక్.. మహేష్ న్యూ లుక్ ఇదే!

Sunday,May 17,2020 - 02:11 by Z_CLU

రెగ్యులర్ డేస్ కంటే ఈ లాక్ డౌన్ టైమ్ లోనే ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యాడు మహేష్. అటు కంప్లీట్ గా కుటుంబంతో ఉంటూనే, ఇటు ఫ్యాన్స్ కు కూడా కొత్తకొత్త ఫొటోలు అందిస్తున్నాడు. ఇందులో భాగంగా మహేష్ నుంచి వచ్చిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఓ సెల్ఫీ దిగాడు మహేష్. అందులో మోస్ట్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. మీసం, గడ్డం తీసేసి.. కాస్త జుట్టు పెంచి హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఈ కొత్త ఫొటో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

త్వరలోనే పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు మహేష్. ఆ మూవీ కోసమే మహేష్ ఇలా మేకోవర్ అవుతున్నాడనే ప్రచారం నడుస్తోంది. అదే కనుక నిజమైతే మేకోవర్ అదిరినట్టే.