స్టైలిష్ లుక్ తో...

Tuesday,December 20,2016 - 04:00 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఫిక్స్ కానీ ఈ సినిమా లో మహేష్ సరి కొత్త స్టైలిష్ లుక్ తో అదరగొట్టబోతున్నాడట.. ఇప్పటి వరకూ చూడని స్టైలిష్ లుక్ తో ప్రిన్స్ ను ఈ సినిమాలో ప్రెజెంట్ చేయబోతున్నాడట మురుగదాస్.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కు ‘ఏజెంట్ శివ’, ‘సంభవామి’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఇంత వరకూ అఫీషియల్ టైటిల్ ను అనౌన్స్ చేయలేదు యూనిట్. ఇక దీపావళి నుండి ఫస్ట్ లుక్ ఇదిగో అదిగో అని ఊరిస్తున్న మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడం తో ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా వుండబోతుందా? అని ఎదురుచూస్తున్న మహేష్ ఫాన్స్ ప్రెజెంట్ ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుండడం తో వాటిని చూసి సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్, గుజరాత్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..

mahesh-looks