మహేష్ మూవీ అప్ డేట్స్

Monday,November 21,2016 - 03:34 by Z_CLU

మహేష్ కరియర్ లోనే మురుగదాస్ తో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం. అఫ్ కోర్స్ ఇరవైకి పైగా సినిమాలు చేసిన సూపర్ స్టార్ తన సినిమా అనౌన్స్ చేశాక, ఇన్నాళ్ళు టైటిల్ అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం.

ఓ వైపు టైటిల్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే, ఏ మాత్రం డీవియేషన్ లేకుండా నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అయిపోతున్నాడు సూపర్ స్టార్. హైదరాబాద్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసిన ప్రిన్స్… ఈనెల 24 నుంచి అహ్మదాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభించనున్నాడు. లొకేషన్స్ లోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మురుగదాస్… ఇప్పటికే అహ్మదాబాద్ లో కొన్ని ప్రాంతాలు ఫిక్స్ చేశాడు. ఈ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ లుక్ టీజర్ విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది.