మహేష్ కోసం మళ్లీ రెండు బ్యానర్లు

Thursday,April 16,2020 - 12:41 by Z_CLU

మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అలాగే ఏకే ఎంటర్టైన్ మెంట్స్ కలిసిన సంగతి తెలిసిందే. అలాగే మహర్షి సినిమాను దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్ సినిమాను రెండు బ్యానర్లు నిర్మించబోతున్నాయి.

అవును… పరశురాం(బుజ్జీ) డైరెక్షన్ లో మహేష్ నటించబోయే సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు కలిశాయి. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ కి మైత్రి నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే పరశురాం కూడా ఈ సంస్థ నుండి ఓ అడ్వాన్స్ అందుకున్నాడు. అందుకే ఇద్దరి సినిమా మైత్రిలో సెట్ అయింది.

అయితే పరశురాం ఈలోపు 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో సినిమా కమిట్ అయ్యాడు. ఇటీవలే నాగచైతన్య, పరశురాం కాంబినేషన్ లో సినిమా కూడా అనౌన్స్ చేసారు 14 రీల్స్ నిర్మాతలు. కానీ అనుకోకుండా మహేష్ నుండి పరశురాంకి కాల్ రావడంతో చైతు సినిమా పక్కన పెట్టారు.

మహేష్ సినిమా కావడం, పరశురామ్ కి ఆల్రెడీ అడ్వాన్స్ ఇవ్వడంతో 14 రీల్స్ ప్లస్ కూడా నిర్మాణ భాగస్వామిగా మారింది. మే 31 న ఈ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.