కాస్త ఆలస్యంగా మహర్షి యూఎస్ షెడ్యూల్

Monday,September 24,2018 - 03:35 by Z_CLU

లెక్కప్రకారం మరో 3 రోజుల్లో మహర్షి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభంకావాలి. కానీ మహేష్ కొత్త సినిమా షెడ్యూల్ కాస్త ఆలస్యంగా మొదలుకానుంది. వీసాకు సంబంధించిన ఫార్మాలిటీస్ ఆలస్యం అవడమే మహర్షి షెడ్యూల్ పోస్ట్ పోన్ కు రీజన్.

ఇప్పటికే డెహ్రాడూన్, హైదరాబాద్ లో 2 షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది మహర్షి మూవీ. మూడో షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఇది కాస్త భారీ షెడ్యూల్. యూనిట్ లో ఎక్కువమంది ఉండాలి. దీంతో వీసా ప్రాసెస్ లేట్ అయింది. అందుకే యూఎస్ షెడ్యూల్ ను వచ్చే నెల రెండో వారానికి వాయిదావేశారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా చాలా షెడ్యూల్స్ పెండింగ్ ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు కూడా చాలా టైమ్ ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. సో.. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మహేష్ 25వ సినిమాను ఓ మాస్టర్ పీస్ గా తయారుచేయాలని అంతా కలిసి ఫిక్స్ అయ్యారు.