బాహుబలి కంటే ముందే మహేష్ సినిమా..?

Sunday,October 23,2016 - 03:17 by Z_CLU

గతంలో జరిగిన ఎపిసోడ్ గుర్తుందా.. బాహుబలి సినిమా విడుదలైన వారం గ్యాప్ లో శ్రీమంతుడు వచ్చింది. మొన్నటివరకు బాహుబలి-2తో పాటు మహేష్ కొత్త సినిమా కూడా వస్తుందని కొందరన్నారు. మరికొందరు మాత్రం గతంలో జరిగిన ఎపిసోడ్ ప్రకారం… బాహుబలి-2 వచ్చిన వారం గ్యాప్ లోనే మహేష్ మూవీ వస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ తాజా టాక్  ప్రకారం… బాహుబలి-2 కంటే ముందే మహేష్ – మురుగదాస్ సినిమా వస్తోంది. అది కూడా 2 వారాల ముందు విడుదలకానుంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే… ఏప్రిల్ 14న మహేష్ మూవీ సందడి చేయడం ఖాయం. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా మరోవారం రోజుల్లో విడుదల చేయబోతున్నారు. కుదిరితే అదే రోజు మూవీ విడుదల తేదీని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఖమ్మం, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.