మహేష్ బాబు ‘మహర్షి’ – దేనికదే స్పెషల్

Monday,December 31,2018 - 06:42 by Z_CLU

మహేష్ బాబు ‘మహర్షి’ నుండి సెకండ్ లుక్ రిలీజయింది. రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ లో కాలేజ్ కుర్రాడిలా, మహేష్ ని మరింత యంగ్ గా ప్రెజెంట్ చేసిన మేకర్స్, ఈ సెకండ్ లుక్ లో స్టైలిష్ బిజినెస్ మ్యాన్ లా ప్రెజెంట్ చేశారు. ఈ సారి కూడా అదే రేంజ్ లో అదిరిపోయాడు సూపర్ స్టార్. ఫ్యాన్స్ కి డెఫ్ఫినెట్ గా ఇది అదిరిపోయే న్యూ ఇయర్ ట్రీట్.

మహేష్ బాబు 25 వ సినిమా అనగానే అటు ఫ్యాన్స్ లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో క్రియేట్ అయిన అంచనాలను మ్యాగ్జిమం అందుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. సినిమా సెట్స్ పై ఉండగానే పక్కా ప్లాన్డ్ గా, అంతే ఎఫెక్టివ్ గా సినిమా నుండి ఒక్కో అప్డేట్ రిలీజ్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తున్న తీరు, ‘మహర్షి’ టీమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఎలివేట్ చేస్తుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 2019 లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజర్. దిల్ రాజు, అశ్వినిదత్ మరియు PVP సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.