మహేష్, కృష్ణ కలిసి సాధించిన తొలి విజయమిది

Monday,July 16,2018 - 12:03 by Z_CLU

మహేష్ బాలనటుడిగా కూడా మెరిసిన సంగతి అందరికీ తెలుసు. తండ్రి కృష్ణ నటించిన ఎన్నో సినిమాల్లో చిన్నారి మహేష్ కీలక పాత్రలు పోషించిన సందర్భాలున్నాయి. అయితే వీళ్లిద్దరూ కలిసి సాధించిన మొట్టమొదటి హిట్ ఏంటో తెలుసా..? దానికి సమాధానమే శంఖారావం.

అవును.. మహేష్, కృష్ణ కలిసి నటించిన సినిమాల్లో తొలి విజయం శంఖారావం. ఈ మూవీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. స్వయంగా కృష్ణ డైరక్ట్ చేసిన సినిమా ఇది. దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ బాధ్యతలు కూడా కృష్ణవే.

అలా 1987న సరిగ్గా ఇదే రోజు (జులై 16) విడుదలైన శంఖారావం సినిమా నేటితో 31 ఏళ్లు పూర్తిచేసుకుంది. విడుదలైన అన్ని సెంటర్లలో 50 రోజులాడింది ఈ సినిమా. ఈ మూవీకి మరో ప్రత్యేకత ఏంటంటే.. దీనికి బప్పిలహరి సంగీతం అందిస్తే, రాజ్-కోటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.