వాయిదాపడిన మహేష్ మూవీ

Tuesday,February 28,2017 - 04:35 by Z_CLU

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదాపడుతూనే ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది మహేష్ చేస్తున్న సినిమా గురించి కాదు. మహేష్ త్వరలోనే చేయబోయే సినిమా కూడా వాయిదాపడుతోంది. అవును.. మురుగదాస్ సినిమా ఇంకా కంప్లీట్ కాకపోవడంతో కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయాల్సిన సినిమా సెట్స్ పైకి రావడం ఆలస్యం అవుతోంది.

గతేడాది నవంబర్ లోనే కొరటాల-మహేష్ సినిమా లాంఛ్ అయింది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ అని అప్పట్లో ప్రకటించారు. కానీ సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు మార్చి నుంచి షూటింగ్ అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం… కొరటాల శివతో కలిసి మహేష్ సెట్స్ పైకి వెళ్లేసరికి మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ వస్తుందని అంటున్నారు.

మరోవైపు మహేష్ మాత్రం మురుగదాస్ సినిమాను షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే మరో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన మహేష్.. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో ఇంకో షెడ్యూల్ స్టార్ట్ చేశాాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత సాంగ్స్ షూటింగ్ ఉంటుంది.