మహేష్-కొరటాల సినిమా టైటిల్ ఫిక్స్

Monday,December 05,2016 - 07:00 by Z_CLU

రూమర్లు నిజమయ్యాయి… అంతా అనుకున్న పేరునేే మహేష్ కొత్త సినిమాకు పెట్టారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. కానీ దీని తర్వాత కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాకు మాత్రం టైటిల్ ఫిక్స్ చేశారు. అదే భరత్ అను నేను. ఈ టైటిల్ ను ఫిలింఛాంబర్ లో అఫీషియల్ గా రిజిస్టర్ చేయించారు. నిర్మాత డీవీవీ దాానయ్య తన బ్యానర్ పై ఈ పేరును రిజిస్టర్ చేయించాడు.

సినిమా ప్రారంభాానికి ముందే ఈ టైటిల్ నెట్ లో చక్కర్లు కొట్టింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ కొత్త సినిమా తెరకెక్కనుందని, దానికి భరత్ అను నేను అనే టైటిల్ ను పెట్టబోతున్నారని వార్తలువచ్చాయి. అప్పట్లో ఆ విషయాన్ని మేకర్స్ కన్ ఫర్మ్ చేయలేదు. కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని కొరటాల ప్రకటించాడు. కానీ ఇప్పుడు అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో ఇదే అఫీషియల్ టైటిల్ గా కూడా మారే అవకాశాలున్నాయి.