కైరాతో స్టెప్పులేస్తున్న మహేష్

Monday,March 12,2018 - 11:48 by Z_CLU

భరత్ అనే నేను సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో, షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న భారీ షెడ్యూల్ లో మహేష్, కైరా అద్వానీపై రాజు సుందరం కొరియోగ్రఫీలో ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీని కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రత్యేకంగా సెట్ వేశారు.

మరో 2 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. తర్వాత యూనిట్ అంతా కలిసి మరో షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్తుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాటికి టోటల్ షూట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ కోసం ఎగ్రెసివ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ ఓథ్, విజన్ ఆఫ్ భరత్ టైటిల్స్ తో ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేశారు. త్వరలోనే మరింత కొత్తగా ప్రచారాన్ని కొనసాగించబోతున్నారు. ఏప్రిల్ 20న థియేటర్లలోకి వస్తోంది భరత్ అనే నేను.