కష్టాన్ని మరిచిపోతున్న మహేష్ బాబు

Tuesday,December 27,2016 - 05:30 by Z_CLU

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎంజాయ్ మూడ్ లోకి షిఫ్ట్ అయ్యాడు. మొన్నటివరకు రెస్ట్ అంటే ఏంటో తెలీకుండా సెట్స్ లోనే గడిసిన ప్రిన్స్.. ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పటికే న్యూయార్క్ లో క్రిస్మస్ ను గ్రాండ్ గా సెలబ్రేేట్ చేసుకున్న మహేష్ ఫ్యామిలీ… న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం న్యూయార్క్ నుంచి మరో దేశానికి వెళ్లే ప్లాన్స్ లో ఉంది.

క్రిస్మస్, న్యూ-ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని తిరిగి జనవరి 4న హైదరాబాద్ చేరుకుంటాడు మహేష్. ఇక అప్పట్నుంచి షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు మురుగదాస్ సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి ఎండింగ్ కు మహేష్ బాబు సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అహ్మదాబాద్ లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశారు.

maheshbabu_44