

Thursday,September 15,2016 - 10:30 by Z_CLU
కథ ప్రకారం ఈ షెడ్యూల్ షూటింగ్ అంతా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో జరగాల్సి ఉంది. అందుకోసం దర్శకుడు మురుగదాస్ 90వ దశకంలో ఇళ్లను పోలిన మిడిల్ క్లాస్ ఇంటిని సెట్ గా వేయాలనుకున్నాడు. ఇటీవలే జ్యో అచ్యుతానంద టీమ్ ఫిలింనగర్లో అటువంటి ఇంటినే రూపొందించి సినిమా చేసింది. ఆ సెట్ ను గమనించిన మురుగదాస్ ఆ ఇల్లు అయితే తమకు సరిగ్గా సరిపోతుందని భావించి దాన్ని వాడుకోవాలని భావిస్తున్నాడట. ఇదే విషయాన్ని వారాహి అధినేత సాయి కొర్రపాటితో చర్చించాడు. అన్నీ కుదిరితే ఆ ఇంట్లోనే మహేష్ షూటింగ్ జరిగే అవకాశం ఉంది.