మూడు సినిమాల పై ఫోకస్

Saturday,January 07,2017 - 04:07 by Z_CLU

‘మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళిపోతా’ అంటూ స్పీడ్ పెంచేసాడు సూపర్ స్టార్. తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఓ సినిమా సెట్స్ పై ఉండగా కేవలం నెక్స్ట్ సినిమా గురించి మాత్రమే ఆలోచించే మహేష్ ప్రెజెంట్ మూడు సినిమాలను లైన్ లో పెట్టేసి జెట్ స్పీడ్ లో దూసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు.

   ప్రెజెంట్ తన 23 వ సినిమాను మురుగదాస్ దర్శకత్వం లో చేస్తున్న ప్రిన్స్ ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు సినిమాల పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తో సెట్స్ పై వెళ్ళబోతున్న మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి తో ఇదే ఏడాది లో మరో సినిమాను సెట్స్ మీద పెట్టబోతున్నాడు. ఈ ఇద్దరి దర్శకుల సినిమాలతో పాటు తన 26 వ సినిమాను త్రివిక్రమ్ తో ప్లాన్ చేసుకున్న ప్రిన్స్ ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇలా ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్ చేసి లైన్ లో పెట్టిన మహేష్ ఈ మూడు సినిమాల తర్వాతే మిగతా దర్శకులతో ఫిక్స్ అవుతాడట.