మే 31 కోసం మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్

Thursday,May 23,2019 - 03:31 by Z_CLU

మే 31 వచ్చేస్తోంది.. ఈరోజు కోసం మహేష్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. అయితే ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ తో పాటు మహేష్ నుంచి ఓ హాట్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

అవును.. తండ్రి ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక స్పెషల్ రిలీజ్ చేయడం మహేష్ కు అలవాటు. సినిమా షూటింగ్ లో ఉంటే ఆ మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తుంటాడు. షూటింగ్ లేకపోతే నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ చెబుతుంటాడు. ఈసారి కూడా అనీల్ రావిపూడితో చేయబోయే సినిమా వివరాల్ని మహేష్ వెల్లడించే ఛాన్స్ ఉంది.

అనీల్-మహేష్ కాంబోలో సినిమా వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తుంది, హీరోయిన్ ఎవరు లాంటి డీటెయిల్స్ మాత్రం సస్పెన్స్ లో ఉన్నాయి. వాటిపై 31న క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.