బిర్యానీ నా ఫేవరెట్ - మహేష్ బాబు

Monday,June 01,2020 - 04:32 by Z_CLU

చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో ఛాటింగ్ చేశాడు మహేష్. తన కొత్త సినిమా డీటెయిల్స్ తో పాటు.. తన పర్సనల్ విశేషాలు కూడా చెప్పుకొచ్చాడు. హేవే లుక్..

– ఫేవరెట్ కలర్, ఫుడ్
నాకు ఇష్టమైన రంగు బ్లూ, ఇష్టమైన భోజనం హైదరాబాదీ బిర్యానీ

– కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడు
అన్ని పరిస్థితలు చక్కబడి త్వరలోనే పనులు ప్రారంభమౌతాయని ఆశిస్తున్నాను. షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే రిలీజ్ పై క్లారిటీ వస్తుంది.

– ఫేవరెట్ గేమ్
మా అబ్బాయి గౌతమ్ తో ఆన్ లైన్లో టెన్నిస్, గోల్ఫ్, బేస్ బాస్ ఆడటాన్ని ఇష్టపడతాను

– మీ పిల్లల కోసం మీరు చేసిన మంచి వంటకం
మ్యాగీ నూడిల్స్ (నవ్వులు)

– రష్మిక-సమంతలో ఎవరంటే ఇష్టం
ఇద్దరూ ఇష్టమే

– మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి
మీ కాంప్లిమెంట్ కు చాలా థ్యాంక్స్. ఫిట్, హెల్తీగా ఉండేందుకు చాలా కష్టపడతాను

– క్వారంటైన్ వల్ల మీ లైఫ్ స్టైల్ లో మార్పులొచ్చాయా
అలాంటిదేం లేదు. నా లైఫ్ స్టైల్ ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. తొందరగా పడుకొని, తొందరగా లేచే టైపు నేను

– జేమ్స్ బాండ్ పాత్రలో చూడాలని ఉంది. భవిష్యత్తులో సాధ్యమేనా?
మంచి స్క్రిప్ట్ ఉంటే పంపించండి.. అలాంటి సినిమా చేయాలని నాక్కూడా ఉంది.

– పూరి జగన్నాధ్ తో భవిష్యత్తులో మూవీ చేసే ఛాన్స్ ఉందా
కచ్చితంగా.. నా ఫేవరెట్ డైరక్టర్స్ లో పూరి జగన్నాధ్ ఒకరు. వచ్చి ఓ నెరేషన్ ఇస్తారని ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను.

– ఎవరితోనైనా క్రష్ ఉందా
26 ఏళ్ల వయసులో ఓసారి ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నాను.

– టీ-కాఫీలో ఏదిష్టం
నాకు కాఫీ అంటే ఇష్టం

– మీ తండ్రికొడుకుల్లో ఎవరు ఎత్తు?
గౌతమ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. ఏ క్షణానైనా నన్ను క్రాస్ చేస్తాడు