మరో షెడ్యూల్ తో రెడీ...

Monday,October 31,2016 - 12:34 by Z_CLU

ఫారిన్ టూర్లు లేవు… కుటుంబంతో హ్యాంగ్ ఔట్స్ లేవు… ఓన్లీ సినిమా… మహేష్ ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టాడు. మురుగదాస్ తో చేస్తున్న సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ పూర్తిచేస్తున్నాడు. దీపావళికి కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ తీసుకున్న మహేష్.. ఈరోజు నుంచి నయా షెడ్యూల్ షురూ చేశాడు. హైదరాబాద్ లో 2 వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది.

ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా గ్యాప్ తీసుకోవాలనుకోవడం లేదు ప్రిన్స్. నవంబర్ 22 నుంచి అహ్మదాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఇలా కంటిన్యూస్ గా షూట్ చేసి సినిమాను తొందరగా పూర్తిచేయాలనుకుంటున్నాడు మహేష్. మహేష్-మురుగ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.