మహేష్ బర్త్ డే గిఫ్ట్ రెడీ

Wednesday,August 05,2020 - 01:14 by Z_CLU

నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ పుట్టిన రోజు రాబోతుంది. ఆగస్ట్ 9 న మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి మహేష్ కి బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతుంది. ఆ రోజు సినిమా ఆరంభంలో వచ్చే టైటిల్ సాంగ్ ను మహేష్ ఫాన్స్ కోసం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మహేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పనున్నారు మేకర్స్.

ఇప్పటికే సాంగ్ కంపోజ్ చేసిన తమన్ తాజాగా రికార్డింగ్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ రిలీజ్ చేయడమే ఆలస్యం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలబెట్టేందుకు సూపర్ ఫాన్స్ రెడీ గా ఉన్నారు. మరి మహేష్ బర్త్ డే రోజు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ఏ రేంజ్ లో పాపులర్ అవుతుందో చూడాలి.

పరశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.