SSMB28 అప్ డేట్ అప్పుడేనా ?

Thursday,January 05,2023 - 01:57 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB28 కి సంబంధించి జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి నుండి భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అరవై రోజుల పాటు ఎక్కడా బ్రేక్ లేకుండా ఓ లాంగ్ షెడ్యూల్ అనుకుంటున్నారు. ఈ సినిమాకి మొదలైనప్పటి నుండి ఏదో ఒక ఆటంకం తగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వస్తుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ కి ఎలాంటి అప్ డేట్స్ లేకుండా పోయింది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాది కి ప్లాన్ చేస్తున్నారు. సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ డేట్ మిస్ అయితే దసరా కి సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి కి అప్ డేట్ రావాల్సింది. కానీ మేకర్స్ లాంగ్ షెడ్యూల్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు అందుకే ఉగాది కి ఫస్ట్ లుక్ అనుకుంటున్నారు.

హరికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల సెకండ్ లీడ్ గా కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics