SarkaruVaariPaata షూటింగ్ అప్ డేట్స్

Tuesday,April 12,2022 - 04:54 by Z_CLU

Mahesh Babu’s ‘SarkaruVaariPaata’ completes shoot except for a song !

సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురాం (బుజ్జి) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన చివరి షెడ్యుల్ లో ఒక సాంగ్ మినహా మిగతా షూట్ అంతా ఫినిష్ చేశారు. మిగిలిన సాంగ్ ని కూడా త్వరలోనే హైదరాబాద్ లో భారీ సెట్ వేసి షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ మహేష్ , కీర్తిలపై వచ్చే డ్యూయెట్ సాంగ్ అని తెలుస్తుంది.

ఇక టోటల్ షూటింగ్ కంప్లీట్ చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మహేష్ ఫ్యాన్స్ కి షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అలాగే మే 12 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్ డేట్స్ రానున్నాయని GET Ready for Exciting updates అంటూ హింట్ ఇచ్చారు.

ఇప్పటికే టీజర్ తో పాటు రిలీజైన రెండు సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూ బజ్ తీసుకొచ్చాయి. త్వరలోనే మిగతా సాంగ్స్ ని కూడా రిలీజ్ చేసి మే ఫస్ట్ వీక్ లో ట్రయిలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , GMB ఎంటర్టైన్ మెంట్స్ బేనర్స్ పై రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics