SarkaruVaariPaata ట్రైలర్ రివ్యూ

Monday,May 02,2022 - 04:58 by Z_CLU

Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ Trailer Review

సూపర్ స్టార్ మహేష్ – పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట‘ ట్రైలర్ రిలీజైంది. హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్ లో ఫ్యాన్స్ నడుమ ట్రైలర్ విడుదల చేశారు యూనిట్.

రెండు నిమిషాల ముప్పై ఆరు సెకన్ల నిడివితో కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద  అంచనాలు పెంచేసి ట్రెండింగ్ లో నిలిచింది. మహేష్ కేరెక్టర్, డైలాగ్స్ సినిమాలో ఎలా ఉంటాయో ట్రైలర్ లో క్లియర్ కట్ చూపించేశాడు దర్శకుడు పరశురాం. అందరికీ అప్పు ఇస్తూ వారి నుండి ఆ డబ్బు వసూళ్ళు చేస్తూ ఆ విషయంలో చాలా సీరియస్ గా బిహేవ్ చేసే కేరెక్టర్ లో మహేష్ కనిపించానున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. చివరికి హీరోయిన్ కూడా హీరో దగ్గర అప్పు చేసి తన వెంట తిప్పించుకుంటుందని తెలుస్తుంది.

యాక్షన్ ఎపిసోడ్ తో వచ్చే షాట్స్ తో స్టార్టయిన ట్రైలర్ లో “నా ప్రేమని దొంగలించగలవు” , ” నా స్నేహాన్ని దొంగలించగలవ్” , యూ కాంట్ స్టీల్ మై మనీ” మీరు నా డబ్బు దొంగలించలేరు అంటూ మహేష్ కేరెక్టర్ ని, సినిమా కథని మూడు ముక్కల్లో చెప్పేశాడు. ఆ వెంటనే వచ్చే ” అమ్మాయిలను, అప్పిచ్చే వాళ్ళని పాంపర్ చేయాల్రా” అంటూ ఫైట్ సీక్వెన్స్ క్లిప్స్ కూడా ఆకట్టుకున్నాయి. అలాగే కీర్తి -మహేష్ కి మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుందో కొన్ని సీన్స్ తో హింట్ ఇచ్చి ఆ ట్రాక్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా ఉంటాయని చెప్పకనే చెప్పారు.

వెన్నెల కిషోర్ తో మహేష్ కామెడీ ట్రాక్ ‘దూకుడు’ సినిమాను గుర్తుచేస్తుంది. ఇందులో వీరిద్దరి కామెడి బాగా వర్కౌట్ అయిందనిపిస్తుంది. సినిమాలో విలన్ గా నటించిన సముద్రఖని కేరెక్టర్ తాలూకు సన్నివేశాలు కూడా ట్రైలర్ లో చూపించి ఆ రోల్ ఎలా ఉండనుందో చెప్పారు. మహేష్ కామెడీ , ఎట్రాక్ట్ చేసే లవ్ ట్రాక్, ఎమోషనల్ కంటెంట్ తో పాటు సినిమాలో మాస్ ఆడియన్స్ ని మెప్పించే అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్  ఉండనున్నాయి ట్రైలర్ తో రుచి రుచిపించాడు పరశురాం.

ట్రైలర్ లో మహేష్ లుక్స్ , బాడీ లాంగ్వేజ్ , కామిక్ టైమింగ్ చూస్తుంటే  ‘పోకిరి’ , ‘దూకుడు’ సినిమాలు గుర్తొస్తున్నాయి. ఆ తరహా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మహేష్ మళ్ళీ ‘సర్కారు వారి పాట’ తో వాటిని మించి ఎంటర్టైన్ మెంట్ అందించడానికి రెడీ అవుతున్నాడనిపిస్తుంది. ట్రైలర్ లో విజువల్స్ , మహేష్ డైలాగ్స్ , మహేష్ – కీర్తి సీన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ , తమన్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పి ‘సర్కారు వారి పాట’ పై భారీ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics