SarkaruVaariPaata టైటిల్ సాంగ్ ఎప్పుడంటే ?

Thursday,April 21,2022 - 12:41 by Z_CLU

Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ Title song release details

సూపర్ స్టార్ మహేష్ బాబు , పరశురాం కాంబినేషన్ లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ నుండి మరో సాంగ్ రాబోతుంది. ఇప్పటికే ఆల్బం నుండి ‘కళావతి’, ‘పెన్ని’ రెండు సాంగ్స్ రిలీజై సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు సినిమాలో  టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఏప్రిల్ 23 న ఉదయం 11: 07 నిమిషాలకు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ (లిరికల్) సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సాంగ్ కోసం తమన్ చాలా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశాడు. “ఈసారి స్పీకర్స్ పగిలిపోవాల్సిందే” అంటూ మైత్రి సంస్థ ట్వీట్ చేసింది. దీంతో సాంగ్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కొన్ని రోజులుగా సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సూపర్ ఫ్యాన్స్ కి టైటిల్ రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసి మంచి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా ? ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్.

మహేష్ , తమన్ కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ టైటిల్ అప్పట్లో సెన్సేషన్ హిట్ సాధించింది. తర్వాత బిజినెస్ మెన్ లో ముంబై సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ కోసం తమన్ ఎలాంటి సాంగ్ కంపోజ్ చేశాడు ? ఈ సాంగ్ ఏ రేంజ్ హిట్ సాదిస్తుందనేది వేచి చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మే 12 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics