SarkaruVaariPaata భారీ సెట్లో మాస్ సాంగ్

Tuesday,April 19,2022 - 01:10 by Z_CLU

Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ Mass Song Shooting In A Massive Set

సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  ‘సర్కారు వారి పాట’ షూటింగ్ చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. ప్రస్తుతం సినిమాలో ఓ మంచి సందర్భంలో వచ్చే మాస్ సాంగ్ ని భారీ సెట్ వేసి తీస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై మాస్ సాంగ్ షూట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. షూటింగ్ లో భాగంగా యూనిట్ లొకేషన్ స్టిల్స్ ని విడుదల చేశారు.  కాళ్ళకి రెడ్ కర్ట్చీప్ కట్టుకొని మహేష్ చాలా మాస్ గా కనిపించనున్నాడని అర్థమవుతుంది.  ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్‌ని వేశారు.

సినిమా కోసం ఎస్ థమన్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించాడు.  ఇప్పటికే  ఈ సినిమాలోని రెండు పాటలు  సూపర్ హిట్స్ గా నిలిచాయి. త్వరలోనే మూడో సాంగ్ రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

   * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics