కే.జి.ఎఫ్ దర్శకుడితోనే మహేష్ సినిమా ?

Sunday,October 13,2019 - 02:03 by Z_CLU

ప్రస్తుతం అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్  ఇంత వరకూ నెక్స్ట్ సినిమాను ఫైనల్ చేయలేదు. ఇప్పటికే మహేష్ లిస్టులో ఓ నలుగురు డైరెక్టర్స్ ఉన్నారు. అందులో కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకడు. మహేష్ కోసం ప్రశాంత్ ఇప్పటికే  ఓ ప్యానిండియా కథను సిద్దం చేసాడనే టాక్ నడుస్తుంది.

ఓ వైపు ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా కమిట్ అయ్యాడు ప్రశాంత్. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఆ సినిమా తర్వాతే మహేష్ తో సినిమా ఉంటుందా లేదా ముందు మహేష్ తోనే ఉంటుందా ? ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే మహేష్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఆ అప్డేట్ ని బట్టే ఈ కాంబో సినిమాపై క్లారిటీ వస్తుంది.