Sarkaru Vaari Paata - బెల్ట్ తీసిన మహేష్ బాబు

Sunday,April 03,2022 - 07:56 by Z_CLU

Mahesh Babu Wishes With An Action-packed Poster from Sarkaru Vaari Paata

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `సర్కారు వారి పాట`. వేసవిలో సినిమా అభిమానులకు ‘సూపర్ స్పెషల్’ ట్రీట్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు స‌రికొత్త యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహేశ్ బాబుపై గూండాలు ఆయుధాలతో దాడికి సిద్ధపడుతుండ‌గా, ‘సూపర్ స్టార్’ తన బెల్ట్ తీస్తూ, వారిపై దాడికి సిద్ధంగా వున్నాడు. ఈ గెట‌ప్‌లో మ‌హేష్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు.

చిత్రానికి సంబంధించిన 2 పాట‌ల‌కు అద్భుతమైన స్పందన రావడంతో మ్యూజికల్ ప్రమోషన్‌లు కూడా జోరందుకున్నాయి. కళావతి మెలోడీ ప్రేమికులను ఆకర్షించగా, రెండవ ట్రాక్, మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తొలిసారిగా కనిపించిన పెన్నీకి అద్భుతమైన స్పందన వచ్చింది. సితార డ్యాన్స్‌కు పలువురు మెచ్చుకున్నారు.

ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ అందిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

mahesh sarkaru vaari paata (1)

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics