కుటుంబంతో కలిసి విదేశాలకు మహేష్ బాబు

Wednesday,January 22,2020 - 12:27 by Z_CLU

ఏమాత్రం ఫ్రీ టైమ్ దొరికినా కుటుంబానికి కేటాయిస్తాడు మహేష్. ఈసారి కూడా అదే పనిచేశాడు. నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే లోపు 2 నెలలు గ్యాప్ తీసుకుంటానని ప్రకటించిన ఈ హీరో, అందులో కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు. భార్యపిల్లలతో కలిసి న్యూయార్క్ వెకేషన్ కు వెళ్లాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేశాడు మహేష్. ఆ సినిమాను భారీగా ప్రమోట్ చేశాడు. రిలీజ్ తర్వాత కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ తో ఆ సినిమా ప్రమోషన్ ను ముగించాడు. అలా ఫ్రీ అయిన మహేష్, కుటుంబంతో కలిసి న్యూయార్క్ వెళ్లాడు. ఈరోజు భార్య నమ్రత పుట్టినరోజును న్యూయార్క్ లోనే సెలబ్రేట్ చేస్తున్నాడు.

న్యూయార్క్ నుంచి తిరిగొచ్చిన తర్వాత మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకొని, సమ్మర్ లోపు కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాస్ గా కనిపించిన మహేష్.. తన కొత్త సినిమాలో మోస్ట్ స్టయిలిష్ గా కనిపించబోతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.