Mahesh Babu - ఒకేసారి 2 సినిమాలు

Friday,June 18,2021 - 03:55 by Z_CLU

కెరీర్ లో మహేష్ బాబు ఎప్పుడూ ఇలా చేయలేదు. ఒక సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే మరో సినిమా మొదలుపెట్టేవాడు. కానీ ఈసారి పరిస్థితులు వేరు. కరోనాతో అన్నీ తారుమారయ్యాయి. మహేష్ కాల్షీట్లు కూడా. ఎప్పట్లానే అలవాటు ప్రకారం, ఈసారి కూడా ఓ సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమా టచ్ చేయకుండా ఉంటే కష్టం. అందుకే మహేష్ కూడా ప్లాన్ మార్చాడు, షెడ్యూల్స్ ఛేంజ్ చేశాడు.

ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ మొదలవుతుంది. యూనిట్ అంతా కలిసి పారిస్ వెళ్లబోతోంది. సినిమాకు సంబంధించి ఫారిన్ లొకేషన్ సీన్స్ అన్నీ కంప్లీట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత తిరిగి ఇదే సినిమాను కంటిన్యూ చేయడం లేదు మహేష్.

mahesh trivikram movie

మహేష్ త్రివిక్రమ్

సర్కారువారి పాట ఫారిన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత.. త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. కొన్ని రోజుల పాటు త్రివిక్రమ్ సినిమా చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ సర్కారువారి పాట సెట్స్ పైకి వస్తాడు. ఇలా రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలని భావిస్తున్నాడు మహేష్ బాబు.

సర్కారువారి పాట పూర్తయ్యేవరకు కాల్షీట్లు ఇచ్చుకుంటూ పోతే, త్రివిక్రమ్ సినిమా లేట్ అవుతుంది. అందుకే ఈసారి రెండు సినిమాలకు కాల్షీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు మహేష్.

మహేష్ కెరీర్ లో మరోసారి గ్యాప్ వచ్చేసింది. అప్పుడెప్పుడో 2020కి సరిలేరు నీకెవ్వరు వచ్చింది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఇంకో సినిమా రాలేదు. ఈ గ్యాప్ ను భర్తీ చేయాల్సిన బాధ్యత మహేష్ పై ఉంది. అటు త్రివిక్రమ్ కు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. మహేష్ కోసం మరికొన్నాళ్లు వేచి చూసే పరిస్థితి లేదు. అందుకే ఇలా ఒకేసారి 2 సినిమాలు చేయాలనుకుంటున్నాడు ఈ స్టార్ హీరో.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics