మహేష్ బాబు హీరోగా ‘దూకుడు 2’

Tuesday,May 07,2019 - 12:02 by Z_CLU

‘దూకుడు 2’ అనగానే ఇక్కడ మహేష్ బాబు సినిమా ‘దూకుడు’ కి సీక్వెల్ కాదు… దూకుడు స్థాయి సినిమా. అవును ‘మహర్షి’ తరవాత మహేష్ బాబు పక్కా అలాంటి సినిమా చేయాలనే డెసిషనే తీసుకున్నాడు. అందుకే మహేష్ బాబు లిస్టు లోకి అనిల్ రావిపూడి వచ్చాడు.

మహేష్ కరియర్ లో ‘దూకుడు’ చాలా స్పెషల్ మూవీ. అప్పటివరకు ఓ పర్టికులర్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు, కామెడీ కంటెంట్ ఉన్న సినిమా చేయడం, దాన్ని ఫ్యాన్స్ అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తూ రిసీవ్ చేసుకోవడం… ‘దూకుడు’ని స్పెషల్ గా నిలబెట్టింది. అందుకే ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమానే చేయాలని ఫిక్సయ్యాడు మహేష్.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న  మహేష్ బాబు సినిమా 100% అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎలిమెంట్స్ తో ఉండబోతుంది. ఈ సినిమా ఎగ్జాక్ట్ గా ‘దూకుడు’ లా ఉండబోతుందని చెప్పలేం కానీ, అనిల్ రావిపూడి రీసెంట్ బ్లాక్ బస్టర్ స్థాయిలో ఈ సినిమాలో కూడా కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉండబోతుంది.

ఈమధ్య వరసగా మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సూపర్ స్టార్, ఈ సినిమాతో ‘దూకుడు’ స్థాయి మార్క్ నే క్రియేట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. దాంతో కామెడీ ఆంగిల్ లో ఇది ‘దూకుడు 2’ అనిపించుకోవడం గ్యారంటీ అనే టాక్ అప్పుడే ఈ సినిమా చుట్టూ క్రియేట్ అవుతుంది.