SSMB28 షూటింగ్ మొదలు పెట్టబోతున్న మహేష్

Saturday,September 10,2022 - 05:39 by Z_CLU

Mahesh Babu, Trivikram’s ‘SSMB28’ first scedule details

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న SSMB28 షూట్ మొదలు కాబోతుంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ కి సెట్ రెడీ అయింది. అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన సెట్ లో ముందుగా ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారని సమాచారం. సోమవారం నుండి పది రోజుల పాటు అక్కడే షూట్ జరగనున్నట్లు తెలుస్తుంది. అలాగే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కూడా భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ , సాంగ్స్ షూట్ చేస్తారని టాక్.

మహేష్ -త్రివిక్రమ్ కాంబోలో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ‘హారికా హాసినీ క్రియేషన్స్’ బేనర్ పై రాదా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ కంపోజర్. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ అవ్వనుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు.