సుకుమార్ లెక్కల్లో మహేష్ బాబు ఎలా మిస్సయ్యాడు..?

Monday,July 24,2017 - 10:03 by Z_CLU

ఆగష్టు 4 గ్రాండ్ గా రిలీజవుతుంది సుకుమార్ దర్శకుడు. హరిప్రసాద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుకుమార్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్న సుకుమార్, NTR  చేత ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేయించాడు. ఆ తరవాత ఆడియో లాంచ్ రామ్ చరణ్ తో చేయించాడు. ఈ లోపు తన సినిమాలకు పని చేసిన హీరోయిన్స్ రకుల్ ప్రీత్ తో పాటు సమంతాలతో ఒక్కో సింగిల్ ని రిలీజ్ చేయించాడు. ఇప్పుడు ఈ క్యూలో అల్లు అర్జున్ పేరు కూడా వినిపిస్తుంది.

జూలై 29 న గ్రాండ్ గా జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రాబోతున్నాడట. ఇదే గనక నిజమైతే మ్యాగ్జిమం తన హీరోలను ‘దర్శకుడు’ ప్రమోషన్స్ కి వాడుకున్న సుక్కు లెక్కల్లో ఒక్క మహేష్ బాబు మాత్రమే మిస్సవుతున్నాడు.

సుకుమార్ అడగాలి కానీ సూపర్ స్టార్ నో అనే ప్రసక్తే ఉండదు, కాకపోతే ఓ వైపు స్పైడర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, మరోవైపు కొరటాల సినిమాతో బిజీ బిజీగా ఉన్న మహేష్ బాబును అప్రోచ్ అవ్వకపోవడమే కరెక్ట్ అనుకుని ఉంటాడు సుకుమార్.