మహేష్ బాబు నిర్మాతగా... అడవి శేష్ హీరోగా..

Wednesday,February 27,2019 - 04:46 by Z_CLU

అవును.. ఇన్నాళ్లూ సహ-నిర్మాతగా మాత్రమే వ్యవహరించిన మహేష్ బాబు ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు. తన సొంత బ్యానర్ పై అడివి శేష్ హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు మహేష్. ఈ సినిమాకు మేజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో గూఢచారి లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తీసిన శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు

ముంబయిలోని తాజ్ మహల్ హోటల్ లో జరిగిన 26/11 బాంబు దాడిలో వందల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ప్రొఫెషనల్ లైఫ్ ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మేజర్ పాత్రలో అడివి శేష్ నటిస్తాడు. ఈ సినిమాతో సోనీ పిక్చర్స్ ఇండియా సంస్థ టాలీవుడ్ లోకి ఎంటరవుతోంది. ఈ సంస్థతో కలిసి మేజర్ సినిమాను నిర్మించబోతున్నాడు మహేష్.

తెలుగు, హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు స్వయంగా అడవి శేష్ స్క్రిప్ట్ రాశాడు. ఈ సమ్మర్ లోనే షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.