అమెరికా బయలుదేరనున్న మహేష్ బాబు

Wednesday,November 08,2017 - 04:28 by Z_CLU

మహేష్ బాబు కొరటాల శివ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా CM చాంబర్ సెట్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్, ఆ  షెడ్యూల్ తరవాత సినిమాలోని హై ఇంటెన్సివ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించేసింది.

బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పక్కా ప్లానింగ్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 26 న బిగిన్ చేయనుంది. ఈ లోపు ఆడ్ షూట్ కోసం ఈ రోజు రాత్రి U.S. కి బయలుదేరనున్నాడు మహేష్ బాబు.

కొరటాల స్టైల్ లో అల్టిమేట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కాంటెపరరీ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కైరా అద్వాని నటిస్తుంది. D.V.V.  దానయ్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్. రాక్ స్టార్ DSP మ్యూజిక్ కంపోజర్.