మహేష్ బాబు రియల్ ఫైట్స్

Monday,September 18,2017 - 12:07 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు కరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ స్పైడర్. మోస్ట్ ఇంటెన్సివ్ డైరెక్టర్ A.R. మురుగదాస్ డైరెక్షన్ లో నటించిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుని డిఫెరెంట్ డైమెన్షన్స్ లలో ప్రెజెంట్ చేయనుంది. ఈ సినిమాలో హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న యాక్షన్ సీక్వెన్సెస్ లలో, మహేష్ బాబు డూప్ లేకుండా తన స్టంట్స్ తానే చేశాడు. ఈ స్టంట్స్ ని పీటర్ హెయిన్స్ కంపోజ్ చేశాడు.

 

స్పైడర్ తో కోలీవుడ్ లోను గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాని N.V. ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించారు.