మహేష్ బాబు ‘ద సాంగ్ ఆఫ్ భరత్’ అదిరింది

Sunday,March 25,2018 - 10:48 by Z_CLU

‘ద సాంగ్ ఆఫ్ భరత్’ రిలీజయింది. అల్టిమేట్ ఇమోషనల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తుందీ సాంగ్. రామ జోగయ్యశాస్త్రి రాసిన ఈ సాంగ్ లిరిక్స్, చీఫ్ మినిస్టర్ లా బాధ్యతలు స్వీకరించే హీరో బాధ్యతలతో పాటు, క్యారెక్టర్ ని హైలెట్ చేస్తున్నాయి.

DSP , కొరటాల కాంబినేషన్ అనగానే ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ రోజు రిలీజైన ఈ సాంగ్, ఫ్యాన్స్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయలేదు. ‘భరత్ అనే నేను – బాధ్యుణ్ణై ఉంటాను..’ అనే లిరిక్ ఇప్పుడు యూత్ లో లేటెస్ట్ హమ్మింగ్ ఎలిమెంట్ లా మారనుంది.

 

డేవిడ్ సైమన్ పాడిన ఈ పాట సినిమాలోని ఇమోషనల్ ఆంగిల్ ని ప్రెజెంట్ చేస్తుంది. D.V.V. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై D.V.V. దానయ్య నిర్మించిన ‘భరత్ అనే నేను’  ఏప్రియల్ 20 న గ్రాండ్ గా రిలీజవుతుంది.