మహేష్ బాబు ‘ద సాంగ్ ఆఫ్ భరత్’ రిలీజ్ డేట్

Friday,March 23,2018 - 07:46 by Z_CLU

ఏప్రిల్ 20 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది మహేష్ బాబు ‘భరత్ అనే నేను’. కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో డిమాండ్ క్రియేట్ చేసుకుంటుంది. దానికి తోడు మార్చి 25 న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ద సాంగ్ ఆఫ్ భరత్’  ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని మరింతగా ఎట్రాక్ట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

 

రీసెంట్ గా రిలీజైన ‘విజన్ ఆఫ్ భరత్’ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతలో రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ ఫస్ట్ సింగిల్ అప్పుడే ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ పాయింట్ లా మారింది. కొరటాల మార్క్ ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు చీఫ్ మినిస్టర్ లా కనిపించనున్నాడు.

 

మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి D.V.V. దానయ్య ప్రొడ్యూసర్. D.S.P. మ్యూజిక్ కంపోజర్.