సెట్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న మహేష్ బాబు టీమ్

Friday,October 13,2017 - 04:13 by Z_CLU

మహేష్ బాబు నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనునుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలో హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాక్షన్స్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. దానికోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్ నిర్మాణం జరుగుతుంది.

గత 2 రోజులుగా ఈ సెట్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్ ఈ సెట్ ని సరికొత్తగా సమ్ థింగ్ డిఫెరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉన్న మహేష్ బాబు ఇండియా వచ్చీ రాగానే ఇమ్మీడియట్ గా షూటింగ్ బిగిన్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

మహేష్ బాబు చీఫ్ మినిస్టర్ గా నటించనున్న ఈ పొలిటికల్ ఇమోషనల్ ఎంటర్టైనర్ లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. D.V.V. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.