మహేష్ - సుకుమార్ మూవీ అప్ డేట్స్
Thursday,November 01,2018 - 10:01 by Z_CLU
ప్రస్తుతం ‘మహర్షి’ మూవీ షూటింగ్ తో బిజీ గా ఉన్న మహేష్ నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీడియాతో పంచుకున్నారు మైత్రి నిర్మాతలు. “సుకుమార్-మహేష్ సినిమాకి కథ ఇంకా సెట్ కాలేదని…ప్రస్తుతం సుకుమార్ గారు కథపై వర్క్ చేస్తున్నారని.. స్టోరీ సెట్ అయితే ఏప్రిల్ లేదా మే నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తామని తెలియజేసారు.
అయితే సినిమా తెలంగాణాలో రజాకార్ల ఉద్యమకాలం నేపధ్యంలో జరిగిన పీరియాడిక్ డ్రామా కథతో తెరకెక్కనుందనే ప్రశ్నకి కూడా క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం ఈ సినిమా కథ విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేసారు. సో ప్రస్తుతం మహేష్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలోనే సుకుమార్ అండ్ టీం పనిచేస్తుందన్నమాట.