సినిమాల ఎంపికలో మహేష్ ఫార్ములా

Wednesday,September 27,2017 - 02:56 by Z_CLU

కథల ఎంపికలో ఒక్కో హీరోది ఒక్కో స్టయిల్. కొందరు హీరోయిజం బాగా ఉండాలనుకుంటారు. మరికొందరు కథ బాగుంటే చాలనుకుంటారు. ఇంకొందరు కమర్షియల్ ఫార్మాట్ ఉందా లేదా అని చూస్తారు. మహేష్ బాబుకు కూడా ఓ ఫార్ములా ఉంది. ఆ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు.

“నా సినిమాల్లో హీరోయిజం ఉండదు. విలన్ ను కొడితే గాల్లో గింగిరీలు కొట్టడం ఇష్టముండదు. క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కథకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా. ఒక్కడు సినిమానే చూస్తే… అందులో హీరోయిజం సెకెండ్ ప్లేస్ లో ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లేదే మొదటి స్థానం. అప్పటికీ ఇప్పటికీ నా ప్రయారిటీ మంచి కథ మాత్రమే” సినిమాల ఎంపికపై మహేష్ తన మైండ్ సెట్ ను ఇలా బయటపెట్టాడు.

తన కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ తో పాటు డిజాస్టర్లు కూడా చూశానని ఓపెన్ గా చెప్పిన మహేష్ బాబు.. ప్రతి ఫెయిల్యూర్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటానని, బాధపడనని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన స్పైడర్ సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది.